15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఆపరేషన్ స్మైల్ విజయవంతం

02-02-2026 12:00 AM

85 మంది బాల కార్మికులకు విముక్తి

ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి

ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ ను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్ పేరుతో జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 85 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు, వసతి గృహాలకు చేర్చి బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్‌ను విజయవం తం చేయడం జరిగిందని తెలిపారు. ఆపరేషన్ స్మైల్‌లో హోటల్లలో, భవన నిర్మాణా లలో, ఇటుక బట్టిలలో పనులలో ఉన్న 85 మంది పిల్లలను రక్షించినట్టు అందులో 72 మంది పిల్లలను తల్లిదండ్రులకు, 13 మంది పిల్లలను వసతి గృహాలకు తరలించి సొంత వారికి అప్పగించినట్లు తెలిపారు.

85 మంది పిల్లలలో 79 మంది బాలురు 06 బాలికలు ఉన్నట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వారు ఇందులో 24 మంది ఉన్నట్లు తెలిపారు. ఆపరేషన్ స్మైల్ లో భాగంగా జిల్లా వెల్ఫేర్ కమిటీ కార్మిక శాఖ, విద్యాశాఖ, చైల్ ప్రొటెక్షన్ యూనిట్, వైద్య శాఖ, ఎన్జీవోల సహకారంతో జిల్లాలో ఆపరేషన్ స్మైల్ ను విజయవంతం చేసి బాల కార్మికులను గుర్తించి తగు చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు.  చట్ట ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.