4 July, 2026 | 2:32 PM

చెత్తలో దొరికిన బంగారాన్ని అందించిన మున్సిపల్ డ్రైవర్

04-07-2026 01:10 PM

మెట్ పల్లి, జులై 4(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ పరిధిలో శనివారం ఉదయం నాలుగవ వార్డ్ కు చెందిన అంగిడి జల అనే మహిళకు చెందిన ముక్కుపుడక మున్సిపల్ ఆటో డ్రైవర్ కంపెళ్లి రమేష్ కు సంబందించిన చెత్త ఆటోలో పడిపోయింది. దింతో భాదితురాలు ఆటో డ్రైవర్ కు పోన్ ద్వారా సమాచారం అందించారు.డ్రైవర్ డంపింగ్ యార్డ్ చెత్తలో వెతకడంతో ముక్కుపుడక దొరకడం జరిగింది.

దింతో అంగడి జలను మున్సిపల్ కార్యాలయనికి పిలిపించి మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు లంక శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముక్కు పుడక అందించారు.ఈ సందర్బంగా మున్సిపల్ ఆటో డ్రైవర్ రమేష్ ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ చిట్యాల రాజకుమార్,జవాన్లు ముజీబ్,నరేష్,నిజాం,శేఖర్,మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు లంక శ్రీకాంత్,శ్రీను,అనిల్,సంజీవ్, రాజగోపాల్,లక్ష్మీరాజం,కుమార్,రాజం,రాము,నరసయ్య లు పాల్గొన్నారు.