21 August, 2026 | 4:44 PM

Breaking News

నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి   •   శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •  

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

21-08-2026 03:31 PM

ముకరంపుర, ఆగస్టు 21(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల్లో భాగంగా 2వ, 12వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  శంకుస్థాపన చేశారు.2వ డివిజన్‌ లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం 12వ డివిజన్ విఘ్నేశ్వర కాలనీలో UIDF నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల అభివృద్ధితో కాలని వాసులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మేయర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, 12వ డివిజన్ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ వేణు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.