21 August, 2026 | 4:44 PM

Breaking News

నీటి వనరుల వినియోగంపై రైతులను ప్రోత్సహించండి   •   శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం   •   తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •  

యూరియా విషయంలో రైతులు అధైర్యపడకూడదు

21-08-2026 03:38 PM

చేగుంట ఆగస్ట్ 21,విజయక్రాంతి: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం చేగుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం చైర్మన్ తాడెం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి జాన్ వెస్లీ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ.. యూరియా కేంద్రలలో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని అన్నారు , అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్కెట్ కార్యాలయంలో సీసీ రోడ్డు, వాటర్ ప్లాంట్, షేడ్, బాత్రూం గురించి  అభివృద్ధి కార్యక్రమ లకు తీర్మానం చేసి నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, , కుర్మ లక్ష్మి, బల్ రెడ్డి, లక్ష్మణ్ సెట్, రమేష్ సెట్,తదితరులు పాల్గొన్నారు.