రూ.20 లక్షలతో యూజీడీ పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్, ఆగస్టు 17: నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని నర్రేగూడెం అంజనాద్రి నగర్ కాలనీలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న యుజిడి (అండర్గ్రౌండ్ డ్రైనేజీ) పనులకు సోమవారం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర సౌకర్యాలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యుజిడి పనులు పూర్తయితే కాలనీ ప్రజలకు మురుగునీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని, పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరాజు, ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఇంజనీర్ వెంకటరమణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






