18 August, 2026 | 4:04 AM

మాతాశిశు హాస్పిటల్ సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాల నిర్లక్ష్యం

18-08-2026 02:15 AM

సిపిఎం కమిటీ సభ్యులు రమేష్

చుంచుపల్లి ,ఆగస్టు 17 (విజయక్రాంతి): మాత శిశు హాస్పిటల్ లో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నా యని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎజె రమేష్ విమర్శించారు. సిపిఎం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రామవరం లోని మాతా శిశు హాస్పిటల్ సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజె రమేష్ మాట్లాడుతూ హాస్పిటల్లో రోజుకు ఐదు వందల మంది గర్భిణి స్త్రీలు,పిల్లలు వస్తున్నారని కేవలం నలుగురు డాక్టర్లు మాత్రమే ఉన్నారని అ న్నారు. హాస్పిటల్ లో స్కానింగ్ రూమ్ సౌకర్యాలు ఉన్నప్పటికీ రేడియాలజిస్ట్ లేకపోవ డం వలన డాక్టర్లే ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లకు పేరు చెప్పి మరి సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు.

తాగడానికి మంచినీ ళ్ళు కూడా లేవని, బాత్రూంలు, మరుగుదొ డ్లు శుభ్రంగా లేవని చిన్న పిల్లల వార్డుల్లో బాత్రూమ్ లు లేక మరుగు దొడ్లలో లేదా ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారన్నారు. మూడు సంవత్సరాల క్రితం స్వచ భారత్ లో భాగంగా నిర్మించిన మూత్రశాలలు నేటికి ప్రారంభానికి నోచుకోలేదని అవి ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నాయ ని, పార్క్ నిర్వహణ సరిగ్గా లేక అడవిని తలపిస్తుందని ఆరోపించారు. ఈ రెండింటి బా ధ్యత కార్పొరేషన్ అధికారులది అయినప్పటికీ వారు కూడా పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నా రని ఆరోపించారు. గర్భసంచి ఆపరేషన్‌కు వచ్చిన మహిళలను పలు కారణాలు చెప్పి కాలయాపన చేస్తున్నార అన్నారు.