18 August, 2026 | 2:44 AM

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

18-08-2026 02:14 AM

ఎంపీ రఘురామి రెడ్డి

చండ్రుగొండ, ఆగస్టు 17 ( విజయక్రాంతి ):   గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం గా పనిచేస్తున్నట్లు ఖమ్మం ఎంపి రామ సహాయం రఘురామిరెడ్డి తెలిపారు.సోమవారం చండ్రుగొండ మండలంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చండ్రుగొండ మండలంలో కరిసెల బోడు తండా, వెంకటయ్యతండా, బాల్యతండా, రావికంపాడు, తిప్పనపల్లి, మహ్మద్ నగర్ గ్రామాల్లో రూ.2,23 కోట్ల నిధుల అంచనాలతో నిర్మించిన సీసీ రోడ్లు, అంగన్ వాడి భవనం, బీటీ రోడ్డు, ప్రహరీ గోడ, హ్యాండ్ పంపు నిర్మాణాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎంపి మా ట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ని ధులను ప్రణాళికాబద్దంగా గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధదులు, అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.