21-01-2026 04:41:39 PM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 65వ డివిజన్ దేవన్నపేటలో రూ.60 లక్షల సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి పనులకు బుధవారం మేయర్ గుండు సుధారాణితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు శంకుస్థాపనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అవసరం ఉన్న ప్రతి డివిజన్లో పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తున్నామని అలాగే వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని,
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో లాభం చేకూర్చేలా చూడాలని ఆదేశించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానని, గ్రామాలు, డివిజన్ల రూపురేఖలను మారుస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం దేవన్నపేట గ్రామంలో సబ్ సెంటర్ కోసం ఏఎన్ఎం ఆశ వర్కర్లు ఎమ్మెల్యే నాగరాజు కు వినతి పత్రం అందజేయగా వెంటనే సంబంధించి అధికారులతో మాట్లాడి త్వరలోనే ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుగులోత్ దివ్య, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాజిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, ఆత్మకూరు ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, హసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సందెల చిన్ని, పోలేపాక అశోక్, మాట్ల విష్ణు, సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల పవన్, బత్తుల స్వాతి, డివిజన్, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.