calender_icon.png 21 January, 2026 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాని బంగారు బాతులా వాడుకుంటున్నారు

21-01-2026 05:15:13 PM

హైదరాబాద్: సింగరేణిపై కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ వచ్చాకే సింగరేణికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నా పెత్తనం రాష్ట్నానిదే అని చెప్పారు. కేంద్రం తరపున ముగ్గురు మాత్రమే ఉన్నారని, సింగరేణిని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాశనం చేస్తున్నాయని కేంద్రమంత్రి ఆరోపించారు. సింగరేణి కార్మికుల రక్తం, చెమటను దోచుకుంటూ దానిని బంగారు బాతులా వాడుకుంటున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

అలాగే అవినీతి, అక్రమాలకు కేంద్రంగా సింగరేణి మారిందని, తెలంగాణ విద్యుత్ సంస్థలకు బొగ్గును అందించాలని, కేంద్రం నైనీ కోల్ బ్లాక్ ను తెలంగాణకు కేటాయించిందని ఆయన తెలిపారు. నైనీ కోల్ బ్లాక్ కు కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని, టెండర్లు పూర్తి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నాన్చుతోందని కిషన్ రెడ్డి వివరించారు. టెండర్లు రద్దు చేయడం సింగరేణికి అన్యాయం చేయడమే అని, సైట్ విజిట్ కు సింగరేణి సర్టిఫికెట్ ఇవ్వాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని ఆయన చెప్పారు. సైట్ విజిట్ అనేది సెల్ఫ్ సర్టిఫికేషన్ నిబంధన అని, కానీ సింగరేణి ఇవ్వాలనే నిబంధన పెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు.

అంటే వారికి నచ్చిన వారికి నైనీ బ్లాక్ ఇవ్వాలని చూస్తున్నారని, ప్రైవేట్ సంస్థకు వెళ్లేలా నాడు బీఆర్ఎస్ వ్యవహరించిందని, ఇప్పుడు అదే తరహాల్లో కాంగ్రెస్ కూడా కొనసాగిస్తుందని మంద్రి చెప్పారు. తాడిచర్ల కోల్ బ్లాక్ ను కేంద్రం జెన్ కోకు కేటాయించిందని, సింగరేణి మైనింగ్ చేస్తామని ముందుకోస్తే బీఆర్ఎస్ బెదిరించి, వారితో మైనింగ్ చేయబోమని బలవంతంగా లెటర్ ఇప్పించారని ఆయన విమర్శించారు. సింగరేణికి రాష్ట్రప్రభుత్వం రూ.47 వేల కోట్లు బకాయిలు ఉందని, సింగరేణి గ్రేడ్-11 కోల్ ను టన్ను రూ.4,800, కోల్ ఇండియా గ్రేడ్-11 కోల్ ను రూ.1605 కు అమ్ముతోందన్నారు. సింగరేణి బొగ్గు క్వాలిటీ కూడా తగ్గిపోతుందని, సింగరేణి బొగ్గును ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాలు వద్దంటున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. సింగరేణి సంస్థ ఉనికే ప్రమాదకర స్థాయికి చేరిందని, సింగరేణి భూముల్లో అనేక ఆక్రమణలు వెలుస్తున్నాయి.