అన్నదమ్ములను కలిపిన ఎన్నిక బంధం
ఎన్నికలవేళ అన్నదమ్ముల అనుభూతి
ఎన్నికల విధులకు హాజరై ఒక్కచోట చేరిన నలుగురు అన్నదమ్ములు విధులు
అభినందించిన మండల అధికారులు
కుభీర్,(విజయక్రాంతి): ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏదే ఒక చోట ప్రత్యేకత చాటుతూనే ఉంది. తుది విడుదల జరుగుతున్న ఎన్నికల్లో కుబీర్ మండల కేంద్రంలో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో విధులు నిర్వహించే నలుగురు అన్నదమ్ములు ఒకే చోట చేరుకొని కుదిరి మండలంలో విధులు నిర్వహించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అవసరం వచ్చిన అప్పుడు ఫోన్ లో మాట్లాడుకునే అన్నదమ్ములు ఉద్యోగరీత్యా విధివిధా ప్రాంతాల్లో స్థిరపడగా జిపి ఎన్నికల్లో వారికి కుబీర్ మండలంలో ఎన్నికల సిబ్బంది డ్యూటీ పడింది.
వారందరూ ఆప్యాయంగా పలకరించుకుంటూ అన్నదమ్ముల అనుబంధాన్ని జిపి ఎన్నికల బంధంకు కలిపిందని సంబరపడ్డారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలంటేనే ఎంతో ఆసక్తి.. ఎన్నికల్లో ఎన్నుకునే ప్రక్రియలో కుటుంబంలోని నలుగురు అన్నదమ్ములు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వారందరూ ఒక్క చోట చేరి ఎన్నికల విధుల్లో భాగస్వాములవడం ఓ గొప్ప అనుభూతి. ఈ అరుదైన సంఘటన.. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేసే కేంద్రం వద్ద చోటుచేసుకుంది.
నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన రాజులదేవి చంద్రమోహన్ -లక్ష్మీ దంపతుల కుమారులైన రమేష్ బాబు, సురేష్ బాబు, విజయ్ కుమార్, నరేష్ బాబు లు నలుగురు పేదరికం లో మగ్గుతు కష్టపడి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొలువులు సాధించిన వారే. కాగా నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఉద్యోగరీత్యా విధులు నిర్వహిస్తుంటారు. ఒకే చోట నలుగురు అన్నదమ్ములు కలుసుకోవడం చాలా అరుదు. మంగళవారం కుబీర్ లో ఎన్నికల విధులకు సంబంధించి సామాగ్రి పంపిణీ కేంద్రంలో ఈ నలుగురు అన్నదమ్ములు విధి నిర్వహణలో భాగంగా ఒక్కచోట చేరడంతో మండల ప్రత్యేక అధికారి శంకర్ తో పాటు ఎంపీడీవో సాగర్ రెడ్డి, ఎన్నికల అధికారులు జిలకరి రాజేశ్వర్, తాసిల్దార్ శివరాజ్, ఆయా శాఖల అధికారులు నలుగురు అన్నదమ్ములను వేదికపైకి పిలిచి అభినందించారు.
ఈ సందర్భంగా జిలకరి రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ఘట్టం అపురూపమైనదని అందులోనూ ఎన్నికల ప్రక్రియలో నలుగురు అన్నదమ్ములు ఒకే చోట చేరి భాగస్వాములు అవ్వడం అరుదైన సందర్భంగా అభివర్ణించారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు చప్పట్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏవో సారిక రెడ్డి, ఎస్ఐ కృష్ణారెడ్డి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






