19 March, 2026 | 5:14 AM

నాలుగు రోజులు వర్షాలు

18-06-2025 12:02 AM

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో అలర్ట్ జా రీ చేసింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొ త్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూ ర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వివరించారు.