calender_icon.png 20 May, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

20-05-2025 08:19:49 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో మంగళవారం నేడు టీటీడీ ధర్మకర్తల మండలి(TTD Board of Trustees meeting) సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 140.30 గంటలకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగనుంది. 38 అజెండా అంశాలపై చర్చించిన అనంతరం పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. బోర్డు సభ్యులు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి(Tirupati SVIMS Hospital Development )పై నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుమలలోని పలు క్యాంటీన్లకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు ఉన్న ప్రముఖ సంస్థలకు మాత్రమే టెండర్ లో పాల్గొనే అవకాశం ఉంది. తిరుమలలో మఠాల ఆక్రమణపై సర్వే రిపోర్టు మేరకు బోర్డు నిర్ణయం తీసుకోనుంది. టీటీడీ పాలకమండలి పలు కీలక తీర్మానాలు చేయనుంది.