calender_icon.png 20 May, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేలుళ్ల కుట్ర కేసు దర్యాప్తు వేగం పెంచిన ఎన్ఐఏ

20-05-2025 09:34:49 AM

హైదరాబాద్: విజయనగరం ఉగ్ర కుట్ర పేలుళ్ల కేసు(Vizianagaram terror conspiracy blasts case)లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో విస్మయం కలిగించే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి ఏఎస్ఐ, సోదరుడు కానిస్టేబుల్ గా ఉన్న కుటుంబానికి చెందిన సిరాజ్ ఎస్ఐ పోస్టుకు శిక్షణ తీసుకునేందుకు హైదరాబాద్ కు వెళ్లాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేసి 7 నెలల క్రితం విజయనగరం వచ్చాడు. సిరాజ్ ఉగ్ర కార్యకలాపాలను హైదరాబాద్ నిఘా వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాల ఆదేశాల మేరకు సిరాజ్ ను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు.

నిఘా వర్గాల అప్రమత్తతతో కుట్ర అమలుకు ముందే పేలుళ్ల ప్రమాదం(Terror attack) తప్పింది. సిరాజ్ ఉర్ రెహ్మాన్(29), హైదరాబాద్ చెందిన సయ్యద్ సమీర్ అరెస్ట్ అయ్యారు. సిరాజ్ వద్ద పేలుళ్లకు వాడే అమోనియా, సల్ఫర్, అల్యూమినియం పొడి స్వాధీనం చేసుకున్నారు. సిరాజ్, సమీర్ చట్టవిరుద్ధ పనుల నివారణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సిరాజ్, సమీర్ రిమాండ్ ఖైదీలుగా విశాఖ జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరింత సమాచారంతో కోసం సిరాజ్, సమీర్ కస్టడీకి పోలీసులు పిటిషన్ వేశారు. న్యాయస్థానం పోలీసు కస్టడీపై సాంకేతిక అంశాలు పరిశీలిస్తోంది. పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ కు సోషల్ మీడియా ద్వారా సమీర్ సహా నలుగురు పరిచయం అయ్యారు. 

సిరాజ్ కు సమీర్(Siraj-ur-Rehman Arrested) సహా కర్నాటక, మహారాష్ట్రకు చెందిన మరో నలుగురు పరిచయం అయ్యారు. ఉగ్ర కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిరాజ్ బృందం  ప్రత్యేకంగా సిగ్నల్ యాప్ ద్వారా ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. సిగ్నల్ యాప్ ద్వారా ఏడాది నుంచి కార్యకలాపాలు ముమ్మరం చేశారు. పేలుళ్ల కుట్ర కోసం ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాలు కొనుగోలుతో ప్రత్యేక నిఘా వర్గాలు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. విజయనగరంలోనే ఉంటూ ఎన్ఐఏ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. ఎన్ఐఏ సిరాజ్, సమీర్ పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తుపై వేగం పెంచింది.

కేసు వ్యవహారం కొలిక్కి వచ్చేవరకు ఎన్ఐఏ(National Investigation Agency) బృందం విజయనగరంలోనే ఉండనుంది. మొదటి రోజు దర్యాప్తులో రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో వివరాలను సేకరించింది. సిరాజ్, సమీర్ ఫోన్లు స్వాధీనం, రిమాండ్ రిపోర్టును ఎన్ఐఏ పరిశీలించింది. సిరాజ్ ఆర్థిక లావాదేవీలపైనా ఎన్ఐఏ అధికారులు ఆరా తీశారు. నిందితుల పోలీసు కస్టడీ అనుమతి కోసం ఎన్ఐఏ అధికారులు ఎదురు చూస్తున్నారు. కస్టడీ లభిస్తే విచారణ తర్వాత కేసు ఎన్ఐఏకు బదిలీ కానున్నట్లు సమాచారం.