27 April, 2026 | 7:27 AM

తిరుమలకు వెళ్లొస్తుండగా ప్రమాదం.. నలుగురు మృతి

21-12-2024 09:56 AM

హైదరాబాద్: శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని మినీ వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. మడకశిర మండలం బుళ్లసముద్రం సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతులను గుడిబండ, రామరాపురం మండలాల వాసులుగా గుర్తించారు. తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో మినీ వ్యానులో 14 మంది యాత్రికులు ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.