27 April, 2026 | 3:38 AM

ఆబ్కారీ శాఖలో అవినీతిపై సర్కార్ సీరియస్?

27-04-2026 01:49 AM

విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎంవో ఆదేశాలు? 

ఎస్టీఎఫ్ టీమ్‌లపై ఏసీబీ ప్రత్యేక దృష్టి 

తయారవుతున్న అవినీతి అధికారుల చిట్టా 

శాఖాపరమైన చర్యలకు అధికారులు సన్నద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయ క్రాంతి): ఆబ్కారీ శాఖలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్టు సమాచారం. గంజాయి, డ్రగ్స్, కొకైన్ ఇతర మత్తు పదార్థాల కట్టడి విషయంలో కొంత మంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.

ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని సంబంధిత శాఖలోని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. ఏండ్లుగా ఎస్టీఎఫ్ (స్టేట్ టాస్క్ ఫోర్స్)గా పనిచేస్తున్న ఒక టీమ్ అరాచకాలపై సమగ్రంగా విచారణ చేసి నివేదిక ఇవ్వా లని సీఎంవో నుంచి ఆదేశాలు అంద డంతో.. ఉన్నతాధికారులు సైతం విచారణ చేపట్టినట్టు తెలిసింది. గంజాయి, గుడుం బా కేసుల్లో పట్టుబడిన వాహనాలను సైతం మాయంచేసినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం విశేషం.

ఆరోపణలతో సిబ్బంది బదిలీ

ఎస్టీఎప్‌కు సంబంధించి ఒకటి, రెండు టీమ్‌లపై అవినీతి, ఆరోపణలకు ఎక్కువగా రావడంతో ఆ టీమ్‌లలోని సిబ్బందిని ఆ బ్కారీ శాఖ వివిధ జిల్లాలకు బదిలీచేసింది. వీరిలో ఒక హెడ్ కానిస్టేబుల్ సెలవుపై వెళ్లిపోయారు. మళ్లీ హెడ్ ఆఫీస్‌కే వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలిసింది. అయితే ఒక ఎస్టీఎఫ్ టీమ్ అధికారి మాత్రం తమకు పాత టీమ్ కావాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

ఒక వైపు ఆబ్కారీ శాఖలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు రావడం, మరో వైపు సర్కార్ సీరియస్‌గా ఉన్నా.. ఎస్టీఎఫ్ టీమ్‌కు చెందిన ఒక అధికారి తనకు పాత టీమ్ కావాలని ఒత్తిడి తేవడంపై సొం త శాఖలోని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఈ టీమ్‌కు ఎక్సైజ్ శాఖ లో పదవీ విరమణపొందిన ఇద్దరు అధికారుల మద్దతు ఉండటంతోనే ఆగడాలు ఎ క్కువైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఎస్టీఎఫ్‌కు సంబంధించి ఒక టీమ్ అవినీతి ఆగడాలపై ఏసీబీ అధికారులు కూడా ఆధారాలు సేకరించినట్టు సమాచారం. త్వరలోనే శాఖాపరమైన చర్యలుండే అవకాశం ఉందని తెలిసింది. రెండేళ్లకోసారి ఎస్టీఎఫ్‌లోని అధికారులను మార్చితేనే అవినీతికి తావుండదని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

గ్రేటర్ పరిధిలో ఆబ్కారీ డివిజన్ల పెంపు? 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆబ్కారీ శాఖకు సంబంధించిన డివిజన్లు పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ డివిజన్లను ఐదు లేదా ఆరు డివిజన్లుగా విభజించేందుకు ఆబ్కారీ శాఖ కసరత్తు చేస్తున్న ట్టు చెబుతున్నారు. డివిజన్ల సంఖ్య పెంచడం ద్వారా పని విభజన సులువుగా ఉండటమే కాకుండా, సర్కార్‌కు ఆదాయం రాకుండా జ రుగుతున్న అక్రమ దందాలను కట్టడి చేసేందుకు అవకాశ ఉంటుందని భావిస్తున్నారు.