దేవరకొండలో ప్రమాదం: ముగ్గురు మృతి
21-12-2024 09:46 AM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. దేవరకొండ పట్టణ శివారులో పెద్ద దర్గా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. దేవరకొండ పెద్ద దర్గా మిఠాయిల దుకాణంలోకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. దేవరకొండ పెద్ద దర్గా వద్ద 2 రోజులుగా ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉర్సు ఉత్సవాల్లో చిరు వ్యాపారులు దుకాణాలు పెట్టుకున్నారు. మృతులను అబ్దుల్ ఖాదర్, హాజీ, నబీనాగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.






