బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలి
- ఎండ తీవ్రత కారణంగా ప్లీనరీని కార్యవర్గ సమావేశాలనికే పరిమితం చేశాం
- పార్టీ శ్రేణులతో టెలీ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినో త్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు. ఆదివారం పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేడు (ఏప్రిల్ 27న) తెలంగాణ భవన్‌లో రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు.
ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యం లో, ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీన రీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు. ఈ స మావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతి నిధులు, కా ర్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వా నం ఉందని పార్టీ స్పష్టం చేసింది.
తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉం టుందని, ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన వారు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. జెండా పండుగ ముగించుకుని, మధ్యాహ్నం 1:30 గంటల కల్లా హైదరాబాద్ చేరుకోవాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి నిధులకు సూచించారు.






