calender_icon.png 13 December, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదం: నలుగురు మృతి

13-12-2025 08:37:58 PM

ఓటు వేసేందుకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం

హైదరాబాద్: మెదక్ జిల్లాలో(Medak district) శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు, కుమారుడు, కుమారై మృతి చెందారు. మెదక్ జిల్లా పెద్దశంకర పేట హైవేపై వాహనం బైకును ఢీకొట్టింది. మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామా వాసులుగా గుర్తించారు. దంపతులు రేపు ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి లింగంపల్లికి వెళ్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.