calender_icon.png 14 December, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోగు బంధంతో ఫోన్ బంధం

14-12-2025 12:00:00 AM

  1. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి
  2. శాలువాపై క్యూఆర్ కోడ్ వేసిన సిరిసిల్ల నేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్
  3. అందులో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, దేవాలయాలు 
  4. శాలువాను ఆవిష్కరించిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 13 (విజయక్రాంతి): సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ ‘క్యూఆర్ కోడ్’ శాలువాను రూపొందించాడు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో ఆ శాలువాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ ప్రతిభను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

శాలువా ప్రత్యేకతలు

‘పోగు బంధంతో ఫోన్ బంధం’ అనే కాన్సెప్టుతో ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు మనకు కనిపిస్తాయి. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్‌ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం.

నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘మా నాన్నగారు గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారు. ఆయనే నాకు స్ఫూర్తి.  ఈ ఆవిష్కరణను కేటీఆర్ ద్వారా కేసీఆర్‌కు అందించాలనే తన కోరికను విజయ్ వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.