పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ
17-04-2026 08:09 PM
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలలకు అన్ని పిజి, ఎంబిఏ, & ఎంసిఏ నాల్గవ సెమిస్టర్ ఫీజు గడువును విడుదల చేసింది. పరీక్షలు జూన్ 2026లో జరుగుతాయని, పరీక్ష రుసుము 27-04-2026 లోపు కట్టవలసిందిగా, 300 రూపాయల అపరాధ రుసుముతో 29-04-2026 వరకు అనుమతించినట్టు తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ అంతర్జాల స్థలంలొ చూడవలసిందిగా లేదా ఆయా కళాశాలలో సంప్రదించవలసిందిగా శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలనియంత్రణ అధికారి డా.డి.సురేష్ కుమార్ తెలిపారు.






