17 April, 2026 | 9:34 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన

17-04-2026 08:06 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి గ్రామ సంఘం వివోఏలకు అవగాహన కల్పించడం జరిగిందని మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల ఇన్చార్జి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ... ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి? ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది ప్రభుత్వం ఎమ్మెస్ఎంఈ (మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైస్)లకు ఇచ్చే అధికారిక గుర్తింపు. ఇది చిన్న సూక్ష్మ, మధ్యతర వ్యాపారులకు నమోదు చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఎందుకు అవసరం? ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి బ్యాంకు రుణాలు సులభంగా పొందడానికి సబ్సిడీలు ప్రోత్సకాలు పొందడానికి వ్యాపార అభివృద్ధికి సహాయం కోసం చిన్న వ్యాపారులు (టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్,కిరాణా మొదలైనవి) మహిళా సంఘాలు స్వయంగా సహాయక సంఘాలు గ్రామీణ పారిశ్రామిక వేత్తలు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.ఆధార్ నెంబర్,మొబైల్ నెంబర్ అవసరమని ఒకసారి నమోదు చేసుకుంటే ఉద్యమ సర్టిఫికెట్ వస్తుందన్నారు.ఈ శిక్షణ వివోఎస్ ద్వారా గ్రామస్థాయిలో మహిళా సంఘాలు మరియు చిన్న వ్యాపారులకు ఈ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడం ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య పాలకవర్గం,సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.