11 July, 2026 | 1:51 AM

సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్

11-07-2026 12:00 AM

అదరగొట్టిన ఎంబాపె

బోస్టన్, జూలై 10: సాకర్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ దుమ్మురేపుతోంది. టైటిల్ రేసులో దూసుకెళ్తున్న ఫ్రెంచ్ టీమ్ తాజాగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. మొరాకోతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 2-0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఎంబాపె తన క్లాస్ ఆటతీరుతో అదరగొట్టా డు. మ్యాచ్ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.

మ్యాచ్ 28వ నిమిషంలో పెనాల్టీ లభించినా ఎంబాపె మిస్ చేశాడు. ఎలాంటి గోల్ నమోదు కాకుండానే మొదటి అర్ధభాగం ముగిసింది. రెండో అర్ధభాగం ప్రారంభంలో మొరాకో అగ్రెసివ్ ఆటతీరుతో ఫ్రాన్స్‌ను కాసేపు ఒత్తిడిలోకి నెట్టింది. కానీ ఫ్రాన్స్ డిఫెన్స్‌ను ఛేదిం చలేకపోయింది. పెనాల్టీ మిస్సయిన నిరాశను పక్కనబెట్టి ఎంబాపె సెకండ్ హాఫ్‌లో విశ్వరూపం చూపించాడు. మ్యాచ్ 60వ నిమిషంలో క్లాసిక్ గోల్ సాధించి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో ఫ్రాన్స్ వరుసగా మూడోసారి సెమీస్‌కు చేరింది.