26 August, 2026 | 10:03 AM

రేగా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

26-08-2026 08:58 AM

రేగాకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పై బురదల్లే ప్రయత్నం చేస్తే ఉపేక్షించేది లేదు.

కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వాసం శ్రీకాంత్.

ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): మణుగూరులో మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై  కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వాసం శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన వీలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ  రేగా కాంతారావుకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అది మరిచి స్వలాభం కోసం బి ఆర్ ఎస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ పార్టీ రేగపై ఎలాంటి కేసులు నమోదు చేయనప్పటికీ, కావాలనే కాంగ్రెస్ నాయకుల పై తీవ్ర విమర్శలు చేయడం సరైన కాదన్నారు.

తప్పు చేయని వారైతే 25 రోజులపాటు అజ్ఞాతంలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. బాధ్యత గల హోదాలో ఉండి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వ్యతిరేకించాల్సింది పోయి, ఆయనే లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం, తప్పించుకునేందుకు 25 రోజులపాటు అజ్ఞాతంలో ఉండటం. కోర్టులో స్టే తెచ్చుకొని ర్యాలీలు ధర్నాలు చేస్తూ ప్రజల మధ్య తన ఉనికిని చాటుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రెడ్డి శాసనసభ్యులు వెంకటేశ్వర్లు పై బురదల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధి అనతికాలంలోనే జరుగుతోందని గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని వీటన్నిటిని ఓర్వలేకనే శాసనసభ్యులు వెంకటేశ్వర్లు పై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని,ధ్వజమెత్తారు.

ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్ మనుగడ కూడా కష్టమేనని ఇప్పటికైనా జరుగుతున్న అభివృద్ధిని గమనించి అసత్య ప్రచారాలు మానుకొని వారి మనగడు కాపాడుకుంటే మంచిదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నులకతాటి శ్రీను ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఇందు కుమార్ మాజీ ఎంపీపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పడిగ సమ్మయ్య రాయపాడు సర్పంచ్ ఎర్రయ్య కాంగ్రెస్ నాయకులు వీరభద్రా చారి భరత్ బుర్ర వెంకన్న పాయం సత్యనారాయణ,బూర్న రవి, మంద సాయిరాజ్ ప్రశాంత్ సాయి కీసరి లాలు సంపత్ తులం శ్రీను తదితరులు పాల్గొన్నారు