సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా
26-08-2026 08:52 AM
ఎల్లారెడ్డి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా మత్తా మాల ప్రశాంత్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక
ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా మత్తమాల ప్రశాంత్ గౌడ్ ను మండలంలోని గౌడ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌడ సంఘం సభ్యులు మండల అధ్యక్షుడిగా మాతమాల ప్రశాంత్ గౌడ్ ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా రఘువీర్ గౌడ్ ముఖ్య కార్యదర్శిగా ఉష గౌడ్ సహాయ కార్యదర్శి గౌడ్ లను ఎన్నుకున్నారు. గౌడ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రశాంత గౌడ్ మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఆయా గ్రామాల్లో చెందిన గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






