బెస్ట్ అవార్డు అందుకున్న ఎమ్మార్వో ను సన్మానించిన ఇమాంపూర్ నేతలు
26-08-2026 08:47 AM
తూప్రాన్, ఆగస్ట్ 26 (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండల రెవెన్యూ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తాను నిర్వహిస్తున్న ఉద్యోగ విధి నిర్వహణలో చాలా చక్కటి ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఎమ్మార్వో అవార్డును అందించింది. ఈ సందర్భంగా ఇమామ్ పూర్ గ్రామ కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ ల పోరం అధ్యక్షులు బక్క సత్యనారాయణ గౌడ్, సర్పంచ్ నవీన్ గౌడ్, స్వామి గౌడ్, మన్య జనార్ధన్ లు ఎమ్మార్వో కార్యాలయం లో వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. గౌరవప్రదమైన అవార్డును సొంతం చేసుకున్న ఎమ్మార్వోకు స్వీట్ తినిపించి హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డిప్యూటీ ఎమ్మార్వో శ్రీకాంత్, రెవెన్యూ తదితర అధికారులు ఉన్నారు.






