13 July, 2026 | 12:06 AM

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని భారీ మోసం

01-06-2024 12:05 PM

హైదరాబాద్: నిరుద్యోలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ యువకుడు మోసం చేసిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. నిందితుడు కేతావత్ సంతోష్  ఉద్యోగాలు ఇప్పిస్తానని  40 మంది నుంచి రూ. 2 కోట్ల మేర వసూలు చేసి జంప్ అయ్యాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశాడు. యువకులకు ఫేక్ హాల్ టికెట్లు, ఫేక్ నియామక పత్రాలు ఇచ్చినట్లు బాధితులు వాపోతున్నారు. డబ్బులు వసూలు చేసి సంతోష్ పారిపోయాడని చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.