12 August, 2026 | 11:43 AM

సిద్దిపేటలో క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ క్యాంప్

12-08-2026 09:33 AM

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి) : క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, మహిళల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు సిద్దిపేటలో ఉచిత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు  మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు తెలిపారు. సిద్దిపేట ఎమ్మెల్యే తనీరు హరీశ్ రావు నాయకత్వంలో పట్టణంలోని పలు వార్డుల్లో దశలవారీగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సంపూర్ణంగా నయం చేయవచ్చన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.