ఘనంగా పోచమ్మ బోనాలు
12-08-2026 09:34 AM
రాజాపూర్ : మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ ప్రజలు పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామంలో వీధి వీధికి వేపాకుల తోరణాలు విద్యుత్ దీపాల అలంకరణతో అలంకరణ చేశారు. గ్రామదర్చేరి పోచమ్మ దేవాలయం ప్రాంగణం ఎంతో సుందరంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి ప్రీతికరమైన బోనం కోసం కొత్త కుండ లో ప్రత్యేకంగా నైవేద్యం చేశారు. బోనాలను పసుపు కుంకుమ వేపకొమ్మలు దీపాలతో సుందరంగా అలంకరించి గ్రామంలో డప్పు చప్పులతో నిర్వహించారు. అమ్మవారికి బోనం కోడిపుంజులు టెంకాయలు సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్, మాజీ సర్పంచ్ రామకృష్ణ గౌడ్,ఉప సర్పంచ్ రామచంద్ర,నరసింహులు గౌడ్,యాదగిరి, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.






