18 August, 2026 | 1:48 AM

మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్స్‌లో ఉచిత శిక్షణ

14-06-2024 12:10 AM

రంగారెడ్డి, జూన్ 13 (విజయక్రాం తి): మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్ గ్రూప్ పరీక్షలకు సంబంధించి 45 రోజుల ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్‌కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, విద్యా ధ్రువీకరణ పత్రాల కాపీలతో పాటు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఈ నెల 18వ తేదీ వరకు కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని కొంగరకలాన్ రెండో అంతస్తులో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.