calender_icon.png 5 November, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులకు ఉచితంగా ప్లేట్ల పంపిణీ

05-11-2025 12:28:13 AM

మనోహరాబాద్, అక్టోబర్ 4 :చిట్కుల లక్ష్మి రామ్ రెడ్డి సేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనోహరాబాద్ మండలంలోని రామాయపల్లి ప్రాథమిక, అంగన్వాడి విద్యార్థిని విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ చిట్కుల మహిపాల్ రెడ్డి ఆయన తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఉచితంగా ప్లేట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హను మంతరావు హాజరై వారి చేతుల మీదుగా చిన్నారులకు ప్లేట్లు పంపిణీ చేశారు.

అంగన్వాడి, ప్రాథమిక పాఠశాలలో ఎలాంటి అసౌకర్యాలు ఉన్నా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని మైనంపల్లి తెలిపారు. రామయపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం మహిపాల్ రెడ్డి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులకు చారిటబుల్ ట్రస్ట్ గుర్తింపు పత్రాలను అందించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కాల్లకల్ మల్లారెడ్డి, చిటుకుల వెంకటరెడ్డి, గడ్డి వెంకటేష్ యాదవ్, రామయపల్లి మాజీ సర్పంచ్, మల్లేష్, ఫ్యాక్స్ డైరెక్టర్ జావిద్ పాషా, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.