05-11-2025 12:29:34 AM
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన యాజమాన్యాలు
యాదాద్రి భువనగిరి నవంబర్ 4 ( విజయక్రాంతి ) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం చేపట్టిన నిరవ ధిక బంద్ రెండవ రోజున కూడా కొనసా గింది. ఈ సందర్భంగా నేడు వినాయక చౌరస్తా నందుగల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహనీకి ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. మరియు అలాగే భువనగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ గారికి వినతి పత్రం అందజేసినారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల అసోసియేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రెండవ రోజు కూడా బంద్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలు పాల్గొన్నాయి అని, ఈ రోజు మేము డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించడం ద్వారా విద్యా హక్కు కోసం మమ్మల్ని గౌరవించేలా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నాం.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అని తెలిపారు. శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ప్రైవేట్ కళాశాలల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, తక్షణమే బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల అసోసియేషన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి అసోసియేట్ ప్రెసిడెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్, శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిక్క ప్రభాకర్, జాగృతి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మనిపాల్ రెడ్డి మరియు పలు కళాశాలల ప్రిన్సిపల్ లు, అధ్యాపకులు పాల్గొన్నారు.