05-11-2025 12:26:59 AM
మునుగోడు, నవంబర్ 4 (విజయక్రాంతి): చేల్లోది తీసేది లేదు చేతికొచ్చింది అమ్ముకునే దిక్కు లేక రైతు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలక మాదిరిలా కొట్టుకుంటు న్నాడు.... మునుగోడు డివిజన్ పరిధిలో దాదాపు ఒక లక్ష 60000 పైచిలుకు ఎకరాల విస్తరణలో రైతులు పత్తి సాగు చేశారు. సాగు చేసే మొదటి క్రమంలో ఆశాజనకంగా వర్షాలు క్రూరంతో రైతులు ఉత్సాహంతో ప్రకృతికి పోటుపరుతూ ఆరుగాలు శ్రమించిన పంటకు అకాల వర్షాలు సంభవించ డంతో రైతు గుండె తడిసి బరువెక్కింది.
మొదట్లో దాదాపు ఎకరంలో 10 నుండి 15 క్వింటాల దిగుబడిని ఆశించిన రైతు నేటి ప్రకృతి వైపరీత్యానికి ఐదు నుండి ఏడు క్వింటాలకు పడిపోవడం రైతు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మూలుగుతున్న నక్కపై తాట పండు పడే చదనంగా చీరపీడల బేడతకు బలైపోయిన రైతుకు కన్నీళ్లే మిగిలాయి. ఇటీవలే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగుడెం మండలం ఎరగండ్లపల్లిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసిన ప్రతి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని అక్కడే ఉన్న రైతు బోరున విలపిస్తూ నీ కాలు మొక్కుతా బాంచన్ 14 తీమ శాతం వచ్చిం ది అధికారులు కోనమని చెప్పి తిరస్కరించారు. మద్దతు ధర తక్కువైనా పర్వాలేదు పత్తి కొనుగోలు చేసి మాకు న్యాయం చేయండి తల్లి అంటూ ఎరుగండ్లపల్లి గ్రామం పత్తి రైతు వీరమల్ల కృష్ణయ్య కలెక్టర్ కాళ్ళపై పొడపోయాడు.
దళారుల చేతుల్లో పత్తి రైతు బలి..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వత్తిని కొనుగోలు చేసేందుకు మద్దతు ధర ప్రకటించినప్పటికీ పంట చేతికొచ్చిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారుల వరకు రైతు చిక్కకా తప్పడం లేదు. కింటాలు పత్తికి ప్రభుత్వం ఎనిమిది వేల ఒక వంద రూపాయల ధరను ప్రకటిస్తే దళారులు మాత్రం రైతుల నుండి నిమ్ము రంగు సాకులతో ఐదు నుండి 6 వేల రూపాయల వరకే కొనుగోలు చేస్తూ దాదాపు 2000 రూపాయలు నష్టపరుస్తున్నారు. ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు నిబంధనలను పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది.
ప్రభుత్వాలు నిబంధనలతో రైతులను చిత్తూ చేస్తున్నాయి..
ప్రభుత్వాలు రైతులని కాపాడుతున్నామని చెబుతూ మద్దతు ధర ఇస్తూ నిబంధనలను పాటించాలని లేదంటే పంట దిగుబడులను కొనేది లేదంటూ మొహం చాటేస్తున్నాయి. రాజకీయ రంగులో ఉన్న నాయకులు రైతును పట్టించుకునే నాధుడే లేరు ఓట్ల కోసం ఉచితలతో రైతులకు గాలం వేసి నేడు ఆరుగాలం శ్రమించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే రైతుని కాపాడలేరా? తమ ఆధిపత్యం కోసమే రైతులను ముంచుతూ నేటికీ ప్రభుత్వాలు రైతులను రాజు చేస్తున్నామని ప్రకటిస్తున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు కరువు అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాలలోకి వచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తిన ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదు.
ఉండేందుకే తడి ఆరట్లేదు పత్తిని ఎక్కడ ఆరబెట్టాలి..
ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధన ప్రకారం పత్తిని తీసుకురావాలని చేయడంతో తుఫాన్ ప్రభావంతో కుడిసిన వర్షాలకు ఆవాసాలలోనే తడి ఆరట్లేదు పత్తిని ఎక్కడ ఆరబెట్టాలని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిబంధనలను సడలించి ధర తగ్గించిన పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వాలని వేడుకుంటున్నారు.
ఆదేశాలు బేఖాతరు..
మర్రిగూడ మండలంలోని యరుగండ్లపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆగ్రో పత్తి మిల్లు ముందు పత్తి రైతులు నిరసన చేపట్టారు. కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా మిల్లు యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము శ్రమించి పండించిన పత్తిని మిల్లు వద్ద అమ్మడానికి వస్తే సరైన రేటు ఇవ్వడం లేదు, ఆలస్యం చేస్తున్నారు. కలెక్టర్ ఇప్పటికే రైతుల పట్ల న్యాయం చేయాలని, మిల్లులు నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు. జిల్లా కలెక్టర్ మా సమస్యలను గమనించి, పత్తి మిల్లులపై చర్యలు తీసుకోవాలని, మా పత్తికి సరైన ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరపగా, పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగింది.