13 May, 2026 | 3:44 AM

ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ బ్రాండ్

02-09-2025 07:10 PM

హైదరాబాద్: వైఎస్ఆర్ జ్జాపకార్థం వ్యవసాయ సంబంధిత అవార్డు ఇవ్వడం హర్షనీయమని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో వైఎస్ఆర్ మెమోరియాల్ అవార్డ్స్(YSR Memorial Awards) కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వ్యవసాయం అంటే ఎంతో ప్రీతి అని, వైఎస్ఆర్ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి అవార్డు ఇవ్వడం సంతోషకారమని తెలిపారు. సుభాష్ పాలేకర్ వ్వవసాయంలో ఎంతోసేవ చేస్తూ.. రైతులకు అవగాహన కల్పిస్తున్నారని, వినూత్న సాగుపద్దతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్ సుధ దంపతులకు కృతజ్జతలు తెలియజేశారు. ప్రజా సమస్యలపై పోరాడే విధానాన్ని వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్నమని, వైఎస్ఆర్ కొన్ని నెలలపాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా రైతుల సమస్యలు తెలుసుకుని తొలి సంతకం ఉచిత విద్యుత్ పై చేశారని, సాకుకు ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క బ్రాండ్ అని తెలిపారు. దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ కు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని, రోగాలబారిన పడిన పేదలకు ఆదుకునేందుకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారన్నారు. పేద విద్యార్థులకు కూడా కార్పోరేట్ విద్య, వైద్యం అందాలని వైఎస్ఆర్ సంకల్పించారని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలు ఇవాళ అన్ని ప్రభుత్వాలకు మార్గదర్శకాలని అన్నారు. ఇల్లు లేని పేదవాడు ఉండొద్దనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టారని, వైఎస్ఆర్ హయంలోనే గ్రామాల్లో పేదలకు లక్షలాది ఇళ్ల నిర్మాణం జరిగిందన్నారు. వైఎస్ఆర్, కేవిపి నాకు మంచిమిత్రులుగా ఉన్నారని, వైఎస్ఆర్ చూపిన బాటలోనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుందని అన్నారు.