calender_icon.png 3 September, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి యూరియా

02-09-2025 04:59:39 PM

హైదరాబాద్: యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రానికి 9 వేల టన్నుల యూరియా సరఫరా అందిందని ప్రకటించింది. రానున్న మరో 5 వేల టన్నుల యూరియా ఇవాళ రాత్రిలోపు అందుతుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. అలాగే రాష్ట్రానికి మరో వారంరోజుల్లో 27,470 టన్నుల యూరియా సరఫరా అవుతుందని.. రైతులకు ఇబ్బందులు రాకుండా పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో వరదల వల్ల పంటనష్టాలపై సర్వే చేయాలని.. 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు.