8 August, 2026 | 1:15 AM

అభిమానులకు ఫ్రీ ఎంట్రీ

08-08-2026 12:00 AM

భారత్‌తో టెస్ట్ సిరీస్‌పై లంక బోర్డు నిర్ణయం

కొలంబో, ఆగస్టు 7: క్రికెట్ ఫ్యాన్స్‌కు శ్రీలంక క్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది. స్వ దేశంలో భారత్‌తో జరగబోయే రెండు టెస్టు ల సిరీస్ కోసం ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్‌షిప్‌లో భాగంగా ఈ రెండు టెస్టుల సి రీస్ జరగనుంది. ఆగస్టు 15నుంచి గాలె స్టేడి యం వేదికగా తొలి టెస్ట్, ఆగస్టు 23 నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి.

అయితే ఫ్రీ ఎంట్రీ కావడంతో ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక గేట్లను కేటాయించారు. గాలె స్టేడియంలో గేట్ నెంబర్ 4 ద్వారా, కొ లంబో స్టేడియంలో గేట్ నెంబర్లు 3,4,5,7 ద్వారా ఉచితంగా ప్రేక్షకులను అనుమతిస్తా రు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉంది. గత ఏ డాది స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ పరాభవాలు భారత్ ఫైన ల్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చాయి. ఇ ప్పుడు ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా 2 గెలవాల్సి ఉం టుంది. మరోవైపు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక ఆరో స్థానంలో ఉంది.