యూరోపియన్ టీ20 లీగ్‌లో రహానే
అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ జట్టుతో ఒప్పందం
ముంబై, ఆగస్టు 7: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత క్రికెట్ జట్టు వెటరన్ క్రికెటర్ ఇక విదేశీ టీ20 లీగ్స్‌తో బిజీ కానున్నాడు. తాజాగా యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో అడుగుపెట్టాడు. ఈ లీగ్ తొలి ఎడిషన్ కోసం అమ్‌స్ట ర్‌డామ్ ఫ్లేమ్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజ మాన్యం అధికారికంగా వెల్లడించింది. ఐసీసీ ఆమోదం పొందిన యూరప్‌లోని మొట్టమొదటి టీ20 లీగ్ ఇదే. ఈ లీగ్ తొలి సీజన్ ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది.
దీనిలో గ్లాస్గో, అమ్‌స్టర్‌డామ్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, బెల్‌ఫాస్ట్ట్, రోటర్‌డామ్ నగరాలకు చెందిన ఆరు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్ ఫ్రాంచైజీ ఓనర్లుగా ఆసీస్ క్రికెట్ దిగ్గజం స్టీవ్‌వా, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వ్యవహరిస్తున్నారు. భారత్ తరపున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20లు ఆడిన రహానేకు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి అనుభవం ఉంది. ఐపీఎల్‌లో 212 మ్యాచ్‌లు ఆడి 5367 పరుగులు చేశాడు. యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం నిర్వహిస్తున్న లీగ్‌లో తాను కూడా భాగం కావడంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు.






