8 August, 2026 | 2:19 AM

ముంచుకొస్తున్న గడువు

08-08-2026 01:15 AM
  1. ముందుకు సాగని సర్ ప్రక్రియ 
  2. గడువు ముంగిట వరుస సెలవులు 
  3. బోనాల సంబరాల్లో ప్రజలు 
  4. వేగం పుంజుకోవడం కష్టమే 
  5. 65 శాతం లోపే డిజిటైజేషన్ 

మేడ్చల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సర్ ప్రక్రియకు గడువు ముంచుకొస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ సీఐ అవకాశం ఇచ్చినందున మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ మూడు రోజులు కూడా సెలవు దినాలు కావడం గమనార్హం. సెలవు దినా ల్లో కూడా బిఎల్‌ఓలు పనిచేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం పండగ మూడ్ లో ఉన్నారు.

జిల్లా ప్రజలు బోనాల పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పరిస్థితుల్లో డిజిటైజేషన్ లో వేగం పుంజుకునే అవకాశం లేదు.4 నుంచి 5వ తేదీ వరకు ఒకరోజు కేవలం 20,000 మాత్రమే డిజిటైజేషన్ అయింది. దీనిని బట్టి పదవ తేదీ వరకు పెద్దగా పెరిగే అవకాశం లేదు. భారత ఎన్నికల కమిషన్ ఇప్పటికే గడువు రెండుసార్లు పెంచింది.

మొదటిసారి జూలై 24 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 3 వరకు పొడిగించింది. మళ్లీ పదవ తేదీ వరకు పెంచింది. మళ్లీ పెరిగే అవకాశం కనిపించడం లేదు. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, కుతుబుల్లాపూర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఇప్పటివరకు 63.08 శాతం డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 2979310 మంది ఓటర్లు ఉండగా, 1879666 మంది ఓటర్ల డిజిటైజేషన్ పూర్తయింది. డిజిటైజేషన్ కానీ ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంది. 

ఆసక్తి చూపని ఓటర్లు 

జిల్లాలో సర్ ప్రక్రియలో తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఓటరు ఆసక్తి చూపడం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. శివారు ప్రాంతాలలో మొత్తం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. వీరిలో చాలామందికి మేడ్చల్ జిల్లాతో పాటు తమ సొంత ప్రాంతాల్లోనూ ఓటు హక్కు ఉంది.

దీంతో వారు సొంత గ్రామాల్లో కోర్టుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఇక్కడ డిజిటైజేషన్ అనుకున్నంత పూర్తి కావడం లేదు. అంతేగాక 2002 ఓటరు జాబితా తో మూడు పెట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. 2002 ఓటరు జాబితా 24 ఏళ్ల కిందట ది. అప్పట్లో ఓటు హక్కు లేని వారు చాలామంది ఉన్నారు. వారి తల్లిదండ్రులకు ఓటు హక్కు ఎక్కడుందో తెలియదు. దీనివల్ల కూడా ఓటర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 

పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ 

ఈసారి పోలింగ్ కేంద్రాలను కూడా హేతుబద్ధీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి నవీన్ కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఒక్కో బూత్ లో 1200 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.