6 July, 2026 | 3:58 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

ఉచిత కంటి వైద్య శిబిరం

03-04-2025 06:36 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పట్టణంలోని రాంనగర్ లో ఉన్న భగవద్గీత అధ్యాయన మండలి ప్రాంగణంలో మంచిర్యాల లయన్స్ క్లబ్, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా గురువారం ఉచిత నేత్ర చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 180 మందికి రేకుర్తి ఐ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఇందులో 75 మంది కంటి శాస్త్ర చికిత్సలకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించారు.

వీరిలో మొదటి విడతగా 54 మందిని లయన్స్ రేకుర్తి ఐ హాస్పిటల్ కు ఉచిత బస్సు, వసతి, ఉచిత భోజన దుపాయాన్ని సమకూరుస్తూ కంటి శాస్త్ర చికిత్సలకు పంపించి, శనివారం ఆపరేషన్లు నిర్వహించి డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని లైన్స్ డిస్ట్రిక్ట్స్ విజన్ సెక్రటరీ లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుల బాలమోహన్, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ రాకేష్ రెడ్డి, ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, కో చైర్మన్ గాదె సత్యం, లయన్స్ విజన్ సెక్రెటరీ లైన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, ఏ రాజేశ్వరరావు, గుండా శ్రీనివాస్, భగవద్గీత అధ్యాయన మండలి అధ్యక్షులు డాక్టర్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.