ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన
సుల్తానాబాద్,(విజయక్రాంతి): లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని ఐతరాజుపల్లి గ్రామంలో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో లయన్ గ్రామ సర్పంచ్ దీకొండ భూమేష్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది.
దాదాపు 150 మంది టెస్టులు చేయించుకోగా ఇందులో 32 మందికి కంటి ఆపరేషన్ అవసరం ఉండగా రేకుర్తి హాస్పిటల్ కు బస్ లో పంపించడం జరిగింది. ఈ సందర్భంగా దీకొండ భూమేష్, జూపల్లి తిరుమలరావులు మాట్లాడుతూ... సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, చుట్టుపక్కల ప్రజలు ఇట్టి కార్యక్రమాన్ని వినియోగించుకొని కంటి అపరేటిన్ కు వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఉచిత కంటి వైద్య శిబిరం మా గ్రామంలో నిర్వహిచినందుకు అధ్యక్షులు జూపల్లి తిరుమల్ రావుకి లయన్ దీకొండ భూమేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎర్రబెల్లి సుధీర్ రావు, కోశాధికారి తమ్మనవేని సతీష్, వైస్ ప్రెసిడెంట్ పూసాల సాంబమూర్తి, లయన్ కన్న రమేష్, ఆడెపు సదానందం, గ్రామ ఉపసర్పంచ్ దాసరి మధుసూదన్ రెడ్డి, వార్డుమెంబర్ గుడాల మారుతి, దాసరి రాజిరెడ్డి, గ్రామప్రజలు పాల్గొన్నారు.




