03-02-2026 08:00:54 PM
సూర్యనారాయణ చారి
గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ సోదరి సోదరుల ఐక్యతతో పాటు సరైన వివాహ సంబంధాల ఏర్పాటే లక్ష్యంగా తునికిపాటి వారి ఉచిత నాలుగవ వివాహ పరిచయ వేదికను ఈ నెల 8వ కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు మట్టపల్లి విశ్వబ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం మాజీ అధ్యక్షులు ఉద్దోజు సూర్యనారాయణ చారి తెలిపారు.
మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్‌లో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని, రెండు తెలుగు రాష్ట్రాల పెళ్లి కాని అబ్బాయిలు, అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమం పూర్తిగా ఉచితం, మధ్యవర్తులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు మట్టపల్లి విశ్వబ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ చారి సెల్ నెంబర్ 9948194158 ను సంప్రదించాలని అన్నారు.