03-12-2025 05:40:51 PM
ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్ శిరీష..
చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట మండల కేంద్రంలో గల భవిత సాహితీ విద్య వనరుల కేంద్రం నందు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో మండల విద్యాధికారి గవ్వ జ్యోతి సమక్షంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రామన్నపేట డాక్టర్లు వరుణ్ రెడ్డి, ఉదయ్ లు కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష హాజరై మాట్లాడుతూ ఈ కేంద్రం నందు ఉన్న వారందరికీ ఇక్కడ అందించే సేవలు మరువలేనివి, మనం ఎంత చేసిన తక్కువనే అన్నారు.
ఎంతో మందికి సేవా చేయాలనే నిండు మనస్సుతో ఎన్నో సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఇక్కడ ఉండే దివ్యాంగ వికలాంగుల పట్ల అసభ్యకరంగా, చులకన భావంతో ఉండకూడదని, వారిలో ఎన్నో నైపుణ్యాలు దాగి ఉన్నాయని, వాటికి బయటికి తీయలన్నారు. ఈ వైద్య శిబిరం నందు మొత్తం 20 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి పండ్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రాల జిల్లా ఇన్చార్జి లింగా రెడ్డి, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, రిసోర్స్ పర్సన్ జంగమ్మ, ఫిజియథెరపీస్ట్ శ్వేత, షఫీ, వైద్య సిబ్బంది సిస్టర్స్ బూపాల, సబిత, హనుమాన్ ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు రేవతి, కవిత, బి.రేవతి, మమత, షమీమ్, పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.