03-12-2025 05:37:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలం చిట్యాల గ్రామంలోని భవిత కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ రూరల్ మండల విద్యాశాఖాధికారి పద్మ వెంకటేష్ మాట్లాడుతూ, దివ్యంగా విద్యార్థులను ప్రతి రోజు భవిత సెంటర్ కు పంపాలని, ప్రత్యేక శిక్షణ పొందిన ఐఆర్పిలు, వారిని సాధారణులుగా తీర్చి దిద్దే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వహీద్, సంతోష్, వజ్రమాల, ఇపిఆర్ శ్రీనివాస్ పోషకులు, విద్యార్థులు పాల్గొన్నారు.