23 March, 2026 | 1:38 AM

రంగాపూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం

23-03-2026 12:00 AM

పెబ్బేరు మార్చి 22: మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ స్తులందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో ఈ శిబిరాన్ని అపోలో హాస్పిటల్, సరోజినీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, భారత్ కంటి హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహి గ్రామంలోని వయోవృద్ధులు, వికలాంగులు, చిన్నారులు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

శిబిరంలో ఈసీజీ, ఆర్థోపెడిక్ పరీక్షలు (మోకాళ్ళు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు), కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు, దగ్గు, జ్వరం వంటి వివిధ వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హేమలత కృష్ణారెడ్డి, డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ప్రతి గ్రామంలో ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్కు చెందిన డాక్టర్ రామిరెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ, డాక్టర్ రాఘవేందర్, చంద్రాస్ రెడ్డి, వార్డ్ సభ్యులు రాములు, సునీతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.