02-02-2026 09:08:37 PM
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రేనోవా హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 4న బుధవారం సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, ప్రజలలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు.