17 April, 2026 | 8:29 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక..

14-06-2025 04:33 PM

రవాణా చార్జీలు లబ్ధిదారులే భరించాలి..

కేసముద్రం తహసిల్దార్ వివేక్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సమీప వాగుల్లోంచి ఉచితంగా ఇసుక అందజేస్తామని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసిల్దార్ జీ.వివేక్(Tehsildar G. Vivek) తెలిపారు. అయితే లబ్ధిదారులు ఇసుక రవాణాకు సంబంధించిన చార్జీలను వారే భరించాల్సి ఉంటుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇసుక కోసం ఏఈ హౌసింగ్ సూచన మేరకు రెవెన్యూ కార్యాలయం నుండి ఉచిత ఇసుక కోసం కూపన్లు జారీ చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఎటువంటి రుసుము లేకుండా తమకు నిర్దేశించిన వాగుల నుంచి కేటాయించిన మేరకు ఇసుకను ఉచితంగా తీసుకు వెళ్ళవచ్చని తెలిపారు. కూపన్లు పొందినవారు ప్రభుత్వ మార్గదర్శక ప్రకారం ఇసుకను పొందవచ్చని చెప్పారు. రవాణా చార్జీలు మాత్రం పూర్తిగా లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని తాసిల్దార్ స్పష్టం చేశారు.