17 April, 2026 | 10:07 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వినియోగదారుల నమ్మకం పోగొట్టకూడదు

14-06-2025 04:31 PM

మునుమోక్షంలో ఆర్వో ప్లాంట్, చాయ్ విల్లాను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): వ్యాపారం ఏదైనా వినియోగదారుల నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకుండా చూడవలసిన బాధ్యత వ్యాపార యజమానులపై ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. శనివారం హన్వాడ మండలంలోని ముని మోక్షం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రోహిత్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేశవులు ఏర్పాటు చేసిన చాయ్ విల్లాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి రోహిత్ రెడ్డి, కేశవులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

మంచి లాభాలను పొందాలని, వ్యాపారాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, మారేపల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి వేముల కృష్ణయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, చెన్నయ్య, టంకర కృష్ణయ్య యాదవ్, నవనీత, బి.మల్లేష్, ఎంపిటిసి కృష్ణయ్య, రాములు, ఎర్ర కిష్టయ్య, ఆనందం, బాల్ రెడ్డి, చిన్న, నాగయ్య,  వెంకటయ్య, యాదిరెడ్డి, పల్లెమోని కాలనీ గ్రామ కమిటీ అధ్యక్షులు అంజిలయ్య, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.