calender_icon.png 23 February, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతి వేగం .. అనర్ధాలకు మూలం

23-02-2026 05:34:54 PM

ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్  శివమ్ ఉపాధ్యాయ

డ్రైవర్లకు ఉచితంగా కంటి చూపుపై ప్రత్యేక శిబిరం ఏర్పాటు

షాద్ నగర్,(విజయక్రాంతి): వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలంటే ముందుగా మెరుగైన కంటి చూపు అవసరమని, అందుకోసం  డ్రైవర్లు కంటి చెకప్ లు చేయించుకోవాలని ఫ్యూచర్ సిటీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివమ్ ఉపాధ్యాయ సూచించారు. సోమవారం రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవ్,అభయ్ సారధి కార్యక్రమాన్ని షాద్ నగర్ ట్రాఫిక్ పోలీస్,లా అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివమ్ ఉపాధ్యాయ., మహేశ్వరం ట్రాఫిక్ ఏసిపి చంద్రశేఖర్, షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ ఐపిఎస్, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్,పట్టణ సీఐ విజయ్ కుమార్ హాజరయ్యారు.ఇందులో భాగంగా ముందుగా 142 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.అనంతరం వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రత్యేక అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శివమ్ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది ఒక క్లిష్టమైన సమస్య.ఇది రోజు వారి జీవితాలను ప్రభావితం చేస్తుందని,దీనిని పరిష్కరించడానికి అవగాహనను వ్యాప్తి చేయడానికి మరియు సురక్షితమైన పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం జాతీయ రహదారి భద్రత కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరు సురక్షితంగా వాహనాలు నడిపి క్షేమంగా గమ్యానికి చేరేలా  ప్రతి ఒక్క పోలీసులు అటు వాహనదారులకు ఇటు డ్రైవర్లకు,ప్రజలకు అవగాహనా చేస్తూ కృషి చేస్తున్నారని అన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అతిపెద్ద నేరమని, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల మీతో పాటు అటు ప్రయాణికులకు ఇటు కుటుంబాలకు తీరని అన్యాయం చేసినట్లు అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు వాహనదారులు డ్రైవర్ మద్యం పూర్తిగా మానేసి సురక్షితంగా వాహనాలు నడిపి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆయన సూచించారు. అనంతరం నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతామని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.