31 July, 2026 | 2:25 AM

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఫ్రీడం వాక్

25-08-2024 01:07 AM

సంగారెడ్డి, ఆగస్టు 24 (విజయక్రాంతి): మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంగారెడ్డి పట్టణంలో శనివారం ఫ్రీడం వాక్ నిర్వహించారు. ఎస్పీ చెన్నూర్ రూపేష్ ఆధ్వర్యంలో డిఅడిక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ఫ్రీడం వాక్ నిర్వహించారు. డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు యువత ముందుకు రావా లని ఎస్పీ రూపేష్ కోరారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, జీవితంలో లక్ష్యం దిశగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సహార దవాఖాన డైరెక్టర్ శంకర్, డీఎస్పీ సత్తయ్యగౌడ్, యువజన సంఘాల నాయకులు కూన వేణు, సంగారెడ్డి నార్కోటెక్ సీఐ రమేశ్, ఎస్బీ సీఐ విజయకృష్ణ, ఇంటలిజెన్స్ డీఎస్పీ మురళి పాల్గొన్నారు.