31 July, 2026 | 3:27 AM

మెస్ చార్జీలు, స్కాలర్‌షిప్స్ పెంచాలి

25-08-2024 12:45 AM
  1. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ 
  2. తెలుగు సంక్షేమ భవన్ ఎదుట ఆందోళన 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (విజయక్రాంతి): ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల మెస్ చార్జీలను, కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగు సంక్షేమ భవన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం ప్రభుత్వం మెస్ చార్జీలు స్కాలర్‌షిప్స్‌ను పెంచిందని, ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు ఆ డబ్బులు సరిపోవడం లేదని తెలిపారు. డబ్బులు సరిపోకపోవడంతో వార్డెన్లు విద్యార్థులకు అందించే పండ్లు, గుడ్లు తగ్గిస్తున్నారని తెలిపారు.