18 May, 2026 | 3:08 AM

మిల్లర్ల మాయ..?

18-05-2026 02:17 AM

బకాయి ఉన్న మిల్లర్లకు మళ్లీ కేటాయింపులు 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఇతర మిల్లర్లు

కామారెడ్డి, మే 17 (విజయక్రాంతి): అక్రమాలకు అరికట్టేందుకు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్న మరోవైపు కొందరు అక్రమ మిల్లర్లు మాత్రం తమ తప్పులను కప్పించుకుంటూ ప్రభుత్వం వద్ద మళ్లీ ధాన్యం తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చ నియంశంగా మారింది. సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించమని కరా కండిగ చెప్పిన అధికారులు, మళ్లీ పప్పులో కాలేశారు. తప్పులు చేసిన వారికి మళ్లీ ధాన్యం కట్టబెట్టారు.

దీంతో నిజాయితీగల మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే మళ్ళీ సీఎంఆర్ పెట్టని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. చట్టంలోని లోసుగులను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ మార్గాలకు అలవాటుపడ్డ కొందరు మిల్లర్ లు అధికారులతో కుమ్మక్కై ధాన్యం కేటాయింపు లు చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వారి మిల్లు మొత్తం అమ్మినా కూడా ప్రభుత్వానికి బకాయిపడిన అప్పు తీరదని అలాంటి వారికి మళ్లీ ధాన్యం కేటాయింపు లు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

కొత్త పేర్లతో మళ్లీ పాతవారే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారని పలువురు జిల్లాలో మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం, రామారెడ్డి మండలంలో పలు రైస్ మిల్లుల యజమానులు ప్రభుత్వానికి సీఎంఆర్ రైస్ ఇవ్వాల్సి ఉండగా వాటిని పక్కన పెట్టి మళ్ళీ ధాన్యం కేటాయించుకోవడం చూస్తుంటే దొంగలకు సద్ది అన్నం కట్టినట్లు అనే సామెత లాగా ఆక్రమ మార్గాలు నడిచే మిల్లర్లకు మళ్లీ ధాన్యం కేటాయించడం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

అధికారుల దృష్టిలో మాత్రం బకాయి లేనివారికి ధాన్యం కేటాయించామని అధికారులు చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వానికి బకాయి పడ్డ మిల్లర్లకు సైతం దానం కేటాయించినట్లు పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధుల తో కుమ్మక్కై అక్రమ సంపాదన కు అలవాటు పడ్డ కొంతమంది మిల్లర్లు మళ్ళీ అక్ర మార్గాలను ఎంచుకొని ధాన్యం కేటాయింపులు చేయించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జిల్లాలోని 126 రైస్ మిల్లులు సిఎంఆర్ రైసు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా అందులో ఏవి కూడా రైస్ ని ఇవ్వకుండా ప్రభుత్వం పంపిన నోటీసులకు భయపడకుండా మళ్ళీ ధాన్యాన్ని కేటాయింపులు చేయించు కోవడంతో ఆక్రమాలు ఆగలేదని పలువురు మిల్లర్లు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల బకాయి ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ధాన్యం కేటాయించడం పట్ల అక్రమార్కులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుంది అనడానికి నిదర్శనం అని పలువురు నిజాయితీగల రైస్ మిల్లర్లు చెప్తున్నారు.

మళ్లీ ధాన్యం కేటాయింపులు 

కామారెడ్డి జిల్లాలో సీఎంఆర్ బకాయి ఉన్న రైస్ మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయింపులు చేపట్టడం పట్ల పలువురు మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీ గల వారికి ఒక రూల్ అక్రమార్కులకు మరో రూల అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి బకాయి పడి ఉన్న రైస్ మిల్లులకు మళ్లీ ధాన్యం కేటాయించడం పట్ల పలువురు రైస్ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ధాన్యం ఎక్కువగా ఉండడం వల్లే..

యాసంగి ధాన్యం ఎక్కువగా రావడంతో లారీల సమస్యతో పాటు అన్లోడ్ సమస్య వాటిల్లడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది బకాయి పడిన రైస్ మిల్లుల కు సైతం ధాన్యం కేటాయింపు లు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా చక్రం తిప్పి ధాన్యం దక్కించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి ధాన్యం కేటాయింపు రైస్ మిల్లులకు జరగలేదని హైదరాబాద్ కేంద్రంగా కేటాయింపులు జరగడం వల్ల తప్పులు దొర్లి ఉన్నాయని అధికారులు అంటున్నారు.

ఏది ఏమైనా అక్రమార్కులు ఏదో ఒక సాకులు చూపెట్టి ధాన్యం దక్కించుకున్నారని తెలుస్తోంది. ధాన్యంబకాయి పడిన మిల్లర్లు కోర్కెక్కారు. హైకోర్టు సైతం సిఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వడంలో మిల్లర్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. పరుగుకు బాధ్యత మిల్లర్లే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. దీంతో రైస్ మిల్లర్ షాకు కు గురయ్యారు. చట్టంలోని లొసుగులను తమకు ఆనుకూలంగా మార్చుకోవడానికి అక్రమాలకు పాల్పడం మిల్లర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ధాన్యం ఈ సీజన్లో సైతం కొందరు దక్కించుకున్నారు. 

ఉన్నతాధికారులకు నివేదించాం 

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వానికి బకాయి పడ్డ మిల్లర్లకు మళ్లీ ధాన్యం కేటాయింపు పట్ల జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా తమ పరిధిలో లేదని, ప్రభుత్వానికి బకాయి పడిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపు పై ఉన్నతాధికారులకు నివేదిక పంపించినట్లు తెలిపారు.

- వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి